తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయ విద్య సీట్ల కోసం కేసీఆర్​కు దాసోజు శ్రవణ్​ లేఖ - nalsar

నల్సార్​ న్యాయ విశ్వవిదాయలయంలో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 85 శాతం సీట్లు స్థానికులకు కేటాయించేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

dasoju-sravan

By

Published : May 6, 2019, 11:13 PM IST

నల్సార్​ న్యాయ విశ్వవిద్యాలయంలో సీట్ల కేటాయింపులో స్థానిక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ స్థానికులకు కేవలం 20 శాతం సీట్లు మాత్రమే కేటాయిస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు 85 శాతం సీట్లు కేటాయించాలన్న చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా వెనుకబడిన విద్యార్థులకు రిజర్వేషన్లు అమలుచేయడంలేదన్నారు. దీనితో పాటు వెనుకబడిన తరగతుల వారికి 29 శాతం సీట్లు ఇవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ సవివరంగా పేర్కొంటూ ఆయన ముఖ్యంమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details