పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అంబేడ్కర్ సంఘాలు విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరినా... ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి జవహర్ నగర్ డంప్ యార్డులో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి అంబేడ్కర్‌పై గౌరవంలేదు: శ్రవణ్ - dasoju sravan
పంజాగుట్ట కూడలిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన వారిపై లాఠీ చార్జీ చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పి సొంత ఖర్చులతో విగ్రహాన్ని పెట్టాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ముక్కలు చేసి తీసుకెళ్లి జవహర్ నగర్ డంప్‌యార్డు చెత్తకుప్పలో పడేశారని విమర్శించారు.
dasoju sravan