వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రజలు వరదల్లో అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి కోట గోడ దాటకుండా.. చోద్యం చూడటం తెలంగాణ దౌర్భాగ్యం అని ధ్వజమెత్తారు.
వరద బాధితులను ఆదుకోవాలి : దాసోజు శ్రవణ్ - ఏఐసీసీ అధికార ప్రతినిధి
భారీ వర్షాల కారణంగా వరదల్లో నష్టపోయిన, ప్రాణాలు కోల్పోయిన ప్రజల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజ్ శ్రవణ్. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
వరద బాధితులను ఆదుకోవాలి : దాసోజు శ్రవణ్
హైదరాబాద్లో మూసీ వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు నగరం అంతా తిరిగి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటి బయటికి రావడం లేదని ఆరోపించారు. కేసీఆర్ బురదలో తిరగలేకపోయినా... కనీసం ఏరియల్ సర్వే అయినా చేయకపోవడం శోచనీయం అన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: అత్యాచారాలు అరికట్టాలని బతుకమ్మ ఆడిన సీతక్క