తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ప్రొఫెషనల్​ కాంగ్రెస్​ ఛైర్మన్​గా దాసోజ్​ శ్రవణ్​ - tpcc chief uttam

తెలంగాణ ప్రొఫెషనల్​ కాంగ్రెస్​ ఛైర్మన్​గా దాసోజ్​ శ్రవణ్​ నియమితులయ్యారు.దాసోజు శ్రవణ్​ టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

dasoju sravan appointed as telangana professional congress chairman
తెలంగాణ ప్రొఫెషనల్​ కాంగ్రెస్​ ఛైర్మన్​గా దాసోజ్​ శ్రవణ్​

By

Published : Jun 18, 2020, 7:47 PM IST

తెలంగాణ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా డాక్టర్ దాసోజు శ్రవణ్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నియమించింది. 2014లో మెదక్ పార్లమెంట్​ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన పోటీ చేశారు. ఇప్పటికే దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఇన్​ఛార్జిగా డాక్టర్ గీతారెడ్డి పనిచేస్తుండగా.. తాజాగా దాసోజు శ్రవణ్‌ను తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్‌గా నియమించారు.

దాసోజు శ్రవణ్‌ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి సంతోష్​కుమార్ రుద్రను ప్రొఫెషనల్‌ ఉపాధ్యక్షులుగా, హైదరాబాద్‌కు చెందిన మన్నే సతీష్ కుమార్‌ను సోషల్ మీడియా ఇన్​ఛార్జిగా నియామిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇవీ చూడండి: హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ పార్టీ

ABOUT THE AUTHOR

...view details