తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో డేటా చోర్యం... కిషన్ రెడ్డికి ఫిర్యాదు - Telangana Government

తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా నాలుగు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రాజకీయ లబ్ధికోసం వాడుకుంటోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత సమాచార దోపిడిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణలో డేటా చోర్యం... కిషన్ రెడ్డికి ఫిర్యాదు

By

Published : Aug 5, 2019, 11:00 PM IST

తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా నాలుగు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రాజకీయ లబ్ధికోసం వాడుకుంటోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని, డేటా గోప్యత-రక్షణ చట్టం-2017, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం-2008లను ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాడుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరి సమాచారం సేకరించి.. ప్రత్యేక డిజిటల్ ప్రింట్ చేసినట్లు గత నెల 5న ఓ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించడంతో దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. వ్యక్తుల వ్యక్తిగత, రహస్య డేటా సేకరణ చేయటం చట్ట వ్యతిరేకమని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని శ్రవణ్‌ కుమార్ కోరారు.

తెలంగాణలో డేటా చోర్యం... కిషన్ రెడ్డికి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details