తెలంగాణ

telangana

ETV Bharat / state

SALAKATLA BRAHMOTSAVALU: అవన్నీ ఉంటేనే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అనుమతి - ttd news

తిరుమలలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకొచ్చే భక్తుల విషయంలో తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్​ వ్యాక్సిన్​ రెండు డోసులు, 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టులతో పాటు ఆన్‌లైన్‌ ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టికెట్లు కలిగిన వారికి మాత్రమే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అనుమతి ఉంటుందని తితిదే సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి తెలిపారు.

ttd
ttd

By

Published : Oct 3, 2021, 4:26 PM IST

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు ఆన్‌లైన్‌ ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టికెట్లు కలిగి ఉండటంతోపాటు రెండు డోసుల వ్యాక్సినేషన్‌, 72 గంటల ముందు పరీక్షించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలని తితిదే అధికారులు స్పష్టం చేశారు. వాటిని తీసుకొచ్చిన వారినే బ్రహ్మోత్సవాలకు అనుమతిస్తామని తితిదే సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు, తితిదే సీవీఎస్‌వో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తితిదే నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సీవీఎస్‌వో అన్నారు. సమీక్షలో అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీవో బాలిరెడ్డి, ఏవీఎస్‌వోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:TTD NEWS: తిరుమలలో డిపాజిట్ రిటర్న్ లేటవుతోంది.. ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details