తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదమరిస్తే అంతే: బస్సులో ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం - ఆర్టీసీ బస్సు

ఆర్డీసీ బస్సులో ప్రయాణం విద్యార్థులకు సాహసంగా మారింది. లోపల చోటులేక బస్సు వెనకాల ఉన్న బ్రేక్​లైట్​ల వద్ద నిల్చుని ప్రయాణం చేస్తున్నారు. రాణీగంజ్​ డిపోకు చెందిన బస్సులో విద్యార్థులు ఇలా ప్రమాదకరంగా ప్రయాణించారు.

''విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం''

By

Published : Sep 20, 2019, 7:50 PM IST

''విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం''

ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల ఫుట్ బోర్డు ప్రయాణమే ప్రమాదం. అలాంటిది ఓ విద్యార్థి చేసిన సర్కస్ ఫీట్ చూపరులను సైతం భయానికి గురిచేసింది. రాణీగంజ్​ డిపోకు చెందిన బస్సులో రద్దీ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఓ విద్యార్థి బస్సు వెనుక భాగంలోని బ్రేక్ లైట్​ల వద్ద ఉన్న పట్టీలపై నిల్చుని ప్రయాణం చేశాడు. ఇలా ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా...ఉదయం కాలేజ్​ సమయంలో ఒకే బస్​ ఉండటం వల్ల ఇబ్బందులు తప్పడం లేదంటూ విద్యార్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details