తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాంకు ఉద్యోగిపై.. దానం నాగేందర్​ దౌర్జన్యం! - ఉద్యోగిపై దానం నాగేందర్​ దౌర్జన్యం

బ్యాంకు ఉద్యోగిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం వ్యవహరించిన తీరు చర్చనీయాశమైంది. బ్యాంకులో లోన్​ తీసుకొని తిరిగి రుణం చెల్లించని ఓ మహిళకు చెందిన భూమిని వేలం వేసి.. ఖైరతాబాద్​లోని ఆ స్థలం చుట్టూ కంచె వేసేందుకు వచ్చిన బ్యాంకు ఉద్యోగుల పట్ల దానం, ఆయన అనుచరులు బెదిరిస్తూ దుర్భాషలాడుతూ నెట్టివేశారు.

Danam Nagender Acts of intimidation On Bank Employees in Khairathabad
బ్యాంకు ఉద్యోగిపై.. దానం నాగేందర్​ దౌర్జన్యం!

By

Published : Jul 26, 2020, 8:32 PM IST

Updated : Jul 27, 2020, 12:16 AM IST

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఓ స్థలాన్ని వేలం ద్వారా విక్రయించిన బ్యాంకు తరపున కంచె వేయించేందుకు ప్రయత్నించిన ఉద్యోగితో.... ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యవహరించిన తీరు చర్చనీయాశమైంది. ఖైరతాబాద్‌లో సాజిద అనే మహిళకు చెందిన 2050 గజాల భూమిని 1950లో కావూరి సాంబసివరావుకు చెందిన..... ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ రూ. లక్షన్నరకు కొనుగోలు చేసింది. ఇందుకు చిక్కడపల్లిలోని ఇండియన్ ఓవర్సీస్‌ బ్యాంకులో రుణం తీసుకుంది. అయితే ఆ రుణాన్ని చెల్లించనందున రోడ్డు విస్తరణలో పోగా మిగిలిన 1500 గజాల స్థలాన్ని బ్యాంకు వేలం వేసింది.
ఈ వేలంలో నోబెల్ రియల్టర్స్.. ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ మేరకు స్థలాన్ని కొనుగోలుదారుకు అప్పగించే క్రమంలో బ్యాంకు సిబ్బంది కంచె వేయించేందుకు అక్కడకు వెళ్లారు. ఇది తెలిసి అక్కడకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. గతంలో అక్కడ పాఠశాల ఉండేదని, ఆ స్థలాన్ని ఎలా అమ్ముతారని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే దానం అనుచరులు బ్యాంకు ఉద్యోగిని నెట్టేస్తున్న వీడియో ఇప్పుడు దుమారు రేపుతోంది. ఈ ఘటనతో బ్యాంకు ఉద్యోగులు ఆ స్థలానికి భద్రత కల్పించాలని సైఫాబాద్ పోలీసులను కోరారు. ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలపారు
బ్యాంకు ఉద్యోగిపై.. దానం నాగేందర్​ దౌర్జన్యం!
Last Updated : Jul 27, 2020, 12:16 AM IST

ABOUT THE AUTHOR

...view details