లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తోన్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకలితో అల్లాడుతున్న వారికి 'ఆహార్ సేవా సంస్థ' సభ్యులు.. అల్పాహారం, భోజనం అందిస్తూ ఔదార్యాన్ని చాటుతున్నారు. నిలోఫర్ ఆసుపత్రి, పబ్లిక్ గార్డెన్‌తో పాటు పలు ప్రాంతాల్లో... పేదల ఆకలిని తీరుస్తున్నారు.
Food Distribution: కరోనా విపత్తు వేళ నిరుపేదలకు ఆహారం పంపిణీ - తెలంగాణలో కరోనా వ్యాప్తి పరిస్థితి
కరోనా కష్టకాలంలో పలువురు వ్యక్తులు, సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుతున్నాయి. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని భోజనాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి. హైదరాబాద్లో 'ఆహార్ సేవా సంస్థ' నిత్యం 2 వేల మంది ఆకలి తీరుస్తోంది.
కరోనా విపత్తు వేళ నిరుపేదలకు ఆహారం పంపిణీ
సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయి పస్తులుంటున్న వారి ఆకలి తీర్చడమే తమ లక్ష్యమంటున్నారు 'ఆహార్ సేవా సంస్థ' నిర్వాహకులు. గ్రేటర్ పరిధిలో రోజూ 2 వేల మందికి అల్పాహారం, భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆకలితో బాధపడేవారికి తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. గతేడాది లాక్డౌన్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!