'ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి' - మున్సిపల్ ఎన్నికలు
జీహెచ్‌ఎంసీ డబీర్‌పురలో ఉపఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అథారిటీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. నేడు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. డబీర్‌పుర వార్డులో 50275మంది ఓటర్లకు గాను 66పోలింగ్ కేంద్రాలు కేటాయించి 511మంది పోలింగ్ అధికారులను నియమించినట్లు కమిషనర్ వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. అలాగే 31పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్నారు.
'ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'
.