మహిళల భద్రత కోసం సంఘమిత్ర కార్యక్రమం - సీపీ సజ్జనార్ వార్తలు
16:42 August 01
మహిళల భద్రత కోసం సంఘమిత్ర కార్యక్రమం
మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కరోనా వల్ల మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారని తెలిపారు. ఉద్యోగాలు చేసే మహిళల్లో చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారని.... దీనివల్ల గృహ హింస, సైబర్ మోసాల బారిన పడుతున్నారని సజ్జనార్ చెప్పారు. ఇలాంటి వాళ్లకు సహాయం చేసేందుకే సంఘమిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
సంఘమిత్ర వాలంటీర్లు బాధిత మహిళలకు చేదోడు వాదోడుగా ఉంటారన్నారు. పోలీసులకు, బాధితులకు సంఘ మిత్ర వారధిగా ఉంటుందని... వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని సజ్జనార్ తెలిపారు.
ఆన్ లైన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్, సినీ నటులు అమల, నమ్రత ఇతర మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. గృహహింస ద్వారా ఒత్తిడికి గురై కుంగిపోయే మహిళలకు సంఘమిత్ర సాయం చేయడం అభినందనీయమని... అలాంటి మహిళలకు సాంత్వన చేకూర్చే వాళ్లుంటే.. బాధితులు ఉపశమనం పొందుతారని అమల, నమ్రత అన్నారు.