గ్రేటర్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. సైబరాబాద్‌లోని 19 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 38 డివిజన్లు ఉన్నాయన్న సజ్జనార్... 684 చోట్ల 2వేల 569 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 770 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి.. గట్టి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 179 రూట్ మొబైల్స్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూంలు, లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తు పెట్టామన్నారు.
గ్రేటర్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ సజ్జనార్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు
గ్రేటర్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. తమ కమిషనరేట్ పరిధిలో 38 డివిజన్లు ఉన్నాయని.. ఎన్నికల కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలు, లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తు సిద్ధం చేశామన్నారు.
గ్రేటర్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ సజ్జనార్
ఎన్నికల కోసం 10వేల 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 3 వేల మంది అదనపు సిబ్బందిని మొహరిస్తామన్నారు. సైబరాబాద్ పరిధిలో 15 చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న సీపీ.. 22 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్ చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులకు బాధ్యతలు