తెలంగాణ

telangana

ETV Bharat / state

కూకట్​పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఏటీఎం వద్ద ఏప్రిల్‌ 29న జరిగిన నగదు దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో.. ఏటీఎం సెక్యూరిటీ గార్డు మృతి చెందగా… మరొకరు గాయపడ్డారు. చోరీకి పాల్పడినవారు బిహార్‌కు చెందిన అజిత్‌కుమార్‌, ముఖేశ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు.

cyberabad cp sajjanar about kukatpalli atm theft, cyberabad cp sajjanar
కూకట్​పల్లి ఏటీఎం కేసు వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్

By

Published : May 12, 2021, 6:20 PM IST

Updated : May 12, 2021, 8:16 PM IST

కూకట్​పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ కేసులో నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లిలోని పటేల్‌కుంటలోని హెచ్​డీఎఫ్​సీ ఏటీఎంలో నగదు పెడుతున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు... సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి రూ.ఐదు లక్షలు దోచుకెళ్లారు. గాయపడిన సెక్యూరిటీ గార్డు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు... బిహార్‌కు చెందిన ఇద్దర్ని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6.31 లక్షల నగదు, నాటు తుపాకీ, ద్విచక్రవాహనం సహా మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. ఇద్దరిలో ప్రధాన నిందితుడైన అజిత్‌కుమార్‌ స్నేహితుడు ముకేశ్‌తో కలిసి చోరికి పాల్పడినట్లు వెల్లడించారు. దొంగలను నిలువరించే ప్రయత్నం చేసిన... డబ్బులు పెట్టే వాహన సిబ్బంది శ్రీనివాస్‌, నవీన్‌లను సీపీ ప్రశంసించారు.

ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన అజిత్‌కుమార్‌, స్నేహితుడు ముకేశ్‌ కుమార్‌తో కలిసి గతంలోనూ అనేక నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సజ్జనార్​ పేర్కొన్నారు. 2018ఏడాది దుండిగల్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యాలయంలో దోపిడీకి విఫలయత్నం చేసి అజిత్‌ స్వగ్రామం వెళ్లినట్టు తెలిపారు. రెండేళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్‌ వచ్చిన అతడు గండిమైసమ్మ ప్రాంతంలో ప్యాకేజింగ్‌ పరిశ్రమలో పనిచేస్తూ నేరాల వైపు మళ్లినట్టు వెల్లడించారు. ఏప్రిల్‌ 16న మనీ ట్రాన్స్‌ఫర్ కార్యాలయంలో రూ.లక్షా 15వేలు దోచుకెళ్లినట్టు తెలిపారు. ఏప్రిల్‌ 24న దుండిగల్‌లో ద్విచక్రవాహనం చోరీ చేసి... కూకట్‌పల్లి ఏటీఎంలో చోరికి పాల్పడినట్లు గుర్తించామన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : May 12, 2021, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details