ఆన్లైన్లో జాబ్ కాంట్రాక్టు ఇస్తానని ప్రకటనలు ఇచ్చి... కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తితో డబ్బులు కట్టించుకొని... చివరికి 2.16లక్షలు టోకరా వేశాడు ఓ సైబర్ నేరగాడు. హైదరాబాద్‌కు చెందిన తాహెర్ మెకానికల్ ఇంజినీర్... ఆన్లైన్లో ప్రాజెక్టులు కాంట్రాక్టు తీసుకొని పనులు పూర్తి చేసి ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే భగీరథ్ అనే వ్యక్తి... తన వద్ద ఉన్న ప్రకటనలను సామాజిక మాధ్యమాలు, గూగుల్‌లో రన్ చేయాలంటూ ఓ ప్రాజెక్ట్ వర్క్ ప్రకటన ఇచ్చాడు. దాన్ని చూసిన తాహెర్.. ఆ పని చేస్తానని అతడితో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో రన్ చేసేందుకు ముందుగానే డబ్బు చెల్లించాలి. దీంతో తాహెర్ తన సొంత డబ్బులతో... భగీరథ్‌కు సంబంధించిన ప్రకటనలు రన్ చేశాడు.
2.16లక్షలు టోకరా వేసిన సైబర్ నేరగాడు - hyderabad
రాష్ట్రంలో సైబర్ నేరాలకు హద్దు అదుపులేకుండా పోయింది. రోజుకో పద్ధతిలో మోసగాళ్లు నేరాలు చేస్తున్నారు. జాబ్ కాంట్రాక్టు ప్రకటనలు ఇచ్చి కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తితో పని చేయించుకుని చివరకు మోసం చేశాడు ఓ సైబర్ నేరగాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఆ తర్వాత నిర్ణీత సమయానికి 2.16 లక్షల బిల్లు చెల్లించేందుకు భగీరథ్ ముందుకు వచ్చాడు. ఆ మొత్తాన్ని థర్డ్ పార్టీ పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లించేందుకు డిపాజిట్ చేశాడు. నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకోసారి డబ్బు తీసుకునే వెసులు బాటు ఉంటుంది. దీంతో భగీరథ్ డబ్బులు డిపాజిట్ చేసినట్లే చేసి... 13వ రోజు తిరిగి ఆ డబ్బును వాపస్ తీసుకున్నాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు తాహెర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి: ఎస్బీఐలో చోరీకి దొంగల విఫలయత్నం!