తెలంగాణ

telangana

ETV Bharat / state

డేటింగ్ పేరుతో 8కోట్లు కొల్లగొట్టారు...

కాల్​ సెంటర్​తో ప్రారంభమైన ముగ్గురు స్నేహితుల వ్యాపారం.. డేటింగ్​ సైట్​గా మారింది. అందులో పనిచేసే మహిళా ఉద్యోగులే యువకులకు ఎర వేసేవారు. ఉచ్చులో పడ్డవారిని బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. కోల్​కతా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సైబర్​ కేటుగాళ్లను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.

డేటింగ్ పేరుతో 8కోట్లు కొల్లగొట్టారు...

By

Published : Aug 27, 2019, 9:48 AM IST

అందమైన అమ్మాయిలతో మాట్లాడండి... డేటింగ్ ఇష్టపడే వారితో గడపండి... నెల... మూడు నెలలు... సంవత్సరం... ప్యాకేజీలున్నాయంటూ కోల్​కతా కేంద్రంగా కోట్లు కొల్లగొడుతున్న ముగ్గురు సైబర్ నేరస్థులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సోమా సర్కార్, అంబాసుర్, ఇమ్రాన్ లవ్ ఆర్ట్ డేటింగ్ వెబ్​సైట్ ద్వారా రెండేళ్లలో దేశవ్యాప్తంగా యువకులను ఆకర్షించి రూ.8 కోట్లు కొల్లగొట్టారు. వీరితో పాటు కాల్ సెంటర్​లో పని చేస్తున్న 20 మంది యువతులను అరెస్టు చేశారు. కోల్​కతాకు చెందిన సోమా సర్కార్ రెండేళ్ల కిందట ఒక కాల్​ సెంటర్ ఏర్పాటు చేశారు. అంబాసుర్, ఇమ్రాన్​లను మేనేజర్లుగా... ఇరవై మంది యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. సంస్థ నష్టాలు రావడం వల్ల.. పంథా మార్చేసి డేటింగ్ సైట్​ను ప్రారంభించారు.

డేటింగ్ పేరుతో 8కోట్లు కొల్లగొట్టారు...
డేటింగ్ పేరుతో 8కోట్లు కొల్లగొట్టారు...

యువతుల ఫోటోలు, వారి వివరాలు ఉన్నందున.. వందల మంది యువకులు సభ్యత్వ రుసుం చెల్లించారు. సోమా కాల్ సెంటర్​లో పనిచేసే యువతులే వారితో మాట్లాడేవారు. సభ్యత్వ రుసుం చెల్లించిన యువకుల వివరాలు డేటింగ్ సైట్లలో ఉంచేవారు. తర్వాత వారికి ఫోన్ చేసి మీ ఫోటోలు ఫలానా వెబ్​సైట్లలో ఉన్నాయని... మీరు అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని వారికి ఫోన్ చేసేవారు. కోల్​కతాలో మీపై కేసులు నమోదవుతున్నాయని... పోలీసులు అరెస్టు చేయకుండా ఉండాలంటే కొంత సొమ్ము చెల్లించాలంటూ బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. ఇలా సోమా సర్కార్ చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై నిఘా పెట్టారు. కోల్​కతాకు వెళ్లి ఆదివారం వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్​కు తీసుకువచ్చి జైలుకు తరలించినట్లు సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు.

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... బాధితులకు కలెక్టర్ ఆసరా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details