తెలంగాణ

telangana

ETV Bharat / state

CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ

CWC Meetings in Hyderabad : రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై.. కాంగ్రెస్‌ పార్టీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా సీడబ్ల్యూసీ సమావేశాల్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 16, 17 తేదీల్లో సమావేశాలతో పాటు మరుసటి బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. బహిరంగసభలో కాంగ్రెస్‌ పార్టీ ఐదు గ్యారంటీలతో పాటు.. బీఆర్ఎస్ సర్కార్‌పై ఛార్జీషీట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Congress Working Committee meetings in Hyderabad
CWC meetings in Hyderabad on September 16

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 10:41 PM IST

CWC Meetings in Hyderabad హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు

CWC Meetings in Hyderabad on September 16th : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాలని (CWC Meetings in Hyderabad).. ఏఐసీసీ నిర్ణయించింది. ఈనెల 16, 17 తేదీల్లో వీటిని జరపనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 16న సీడబ్ల్యూసీ ప్రతినిధుల భేటీ, 17న రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులతో భేటీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే 17వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో మెగా ర్యాలీతో పాటు.. బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.

Congress to Announced Five Guarantees in Telangana : ఇందులో భాగంగానే.. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌ రానున్నారు. రాష్ట్రంతో పాటు జాతీయ నేతలతో భేటీ జరిపి.. సమావేశాలు ఎక్కడ నిర్వహించాలనేది ఖరారు చేయనున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో తీర్మానం చేసి పంపించిన మేరకు.. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడంపై.. రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Congress BRS Raise Political Heat in Telangana : అగ్రనాయకులతో సభలు, ప్రచారాలు.. కాంగ్రెస్​ను గెలిపించేనా...?

Revanth Reddy on CWC Meetings : తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. రేవంత్‌రెడ్డి తెలిపారు హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 16, 17వ తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీకి గతంలో లేఖ రాసినట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పటి హైదరాబాద్‌ సంస్థానానికి చెందిన వ్యక్తి అని.. రజాకార్ల చేతిలో ఖర్గే కుటుంబం చనిపోయిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

Revant Reddy on SC ST Declaration : 'అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తాం'

రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక అంశాలపై సీడబ్ల్యూసీ సమావేశాల్లో చర్చ జరుగుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం ప్రారంభిస్తామని వివరించారు. జాతీయ రాజకీయాలపై చర్చకు సీడబ్ల్యూసీ సమావేశం వేదిక కానుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనిరేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. అమలుచేయనున్న ఐదు గ్యారంటీలతో పాటు.. బీఆర్ఎస్ సర్కార్‌ వైఫల్యాలపై ఛార్జీషీట్లను వెల్లడించనున్నట్లు తెలిపారు. హస్తం నాయకులమంతా కలిసి సీడబ్ల్యూసీ సమావేశాలను విజయవంతం చేస్తామని వెల్లడించారు. ఇండియా కూటమి అనుసరించే కార్యాచరణనను ఇదే వేదికగా ప్రకటించనున్నట్లు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

"సీడబ్ల్యూసీ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికలు, పొత్తులు, వ్యుహాలు, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయి. కాంగ్రెస్ నేతలంతా కలిసి సీడబ్ల్యూసి సమావేశాలను విజయవంతం చేస్తాం. ఇండియా కూటమి అనుసరించే కార్యాచరణనను ఇదే వేదికగా ప్రకటిస్తారు." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy on Congress Declarations : 'చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం.. కర్ణాటకలో చేశాం.. తెలంగాణలోనూ చేస్తాం'

Congress MLA Candidates Selections Controversy : కాంగ్రెస్​లో 'డబుల్'​ ట్రబుల్​.. తెరపైకి కొత్త తరహా వివాదం

ABOUT THE AUTHOR

...view details