కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఉపాధి హామీకి కోత Cut to Agriculture Sector in Central Budget: కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ భారతానికి ఆయువుపట్టుగా ఉన్న వ్యవసాయం, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోతలు విధించింది. సాగు అనుబంధ రంగాలకు తగినంత ప్రోత్సాహం కరవైందని సర్వత్రా వినిపిస్తోంది. రైతులకు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలకు లబ్ధి చేకూర్చే ఉపాధిహామీ పథకానికి నిధుల్లో కోత విధించడం పట్ల రైతు సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి.
Cut in Rural Employment Guarantee Funds: కనీస మద్దతు ధర, ఆదాయాల రెట్టింపు, పంటల బీమా, సాగు నీరు వంటి అంశాల ప్రస్తావన లేదని పెదవి విరిచాయి. 2023-24లో కేంద్రం వ్యవసాయ రంగానికి రూ. లక్షా 15 వేల 531 కోట్లు ప్రకటించినా, సాగుకి రూ. 71 వేల 378 కోట్లు మాత్రమే కేటాయించి మిగిలిన నిధులు వివిధ పథకాల పేర్లు మార్చి కేటాయించింది.
గత బడ్జెట్‌లో సాగురంగానికి రూ. లక్షా 24 వేల కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి తగ్గించడం రైతులను విస్మయానికి గురిచేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఏకంగా రూ. 30 వేల కోట్ల నిధులు కోత విధించడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులకు ఆదాయాన్ని ఇస్తూ, ముఖ్యంగా కరోనా సమయంలో గ్రామీణ పేదల ప్రాణాలు కాపాడిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2022-23లో ఖర్చు రూ. 89 వేల 400 కోట్లు కేటాయించగా, 2023-24లో కేవలం రూ. 60 వేల కోట్లకు మాత్రమే కేటాయించారు.
హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతామన్న ప్రకటన శుభపరిణామంగా భావిస్తున్నారు. గ్లోబల్ హబ్‌గా మార్చుతామని కేంద్రం తీపికబురు అందించండాన్ని సాగు నిపుణులు స్వాగతిస్తున్నారు.
ఇవీ చదవండి: