ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన నన్నేబోయిన నరసింహారావు గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. మేత కోసం చర్చి సమీపంలోని సుబాబుల్ చెట్టుపైకి ఎక్కారు. కొమ్మలు నరుకుతూ కిందకు దిగుతున్న సమయంలో ఆకులు విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. స్థానికులు వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపేశారు. చెట్టు ఎత్తుగా ఉండడం వల్ల ఆయనను దించడం వారికి సాధ్యం కాలేదు. ముందుగా గ్రామానికి చెందిన పరిటాల రామకృష్ణ, వెంకయ్య నిచ్చెనల సాయంతో చెట్టుపైకి ఎక్కి కింద పడకుండా పట్టుకున్నారు. ఈలోగా కొందరు సమీపంలోని టోల్ వసూలు కేంద్రం అధికారులకు విషయం తెలిపారు. వారు ఘటనా స్థలం వద్దకు క్రేన్ తీసుకొచ్చారు.
వారి మానవత్వం... ఒకరికి జీవం పోసింది! - కంచికచర్ల
మూగజీవాల మేత కోసం సుబాబుల్ చెట్టెక్కిన ఓ వ్యక్తికి అకస్మాత్తుగా ప్రాణాపాయం ఎదురైంది. ఆకులను కోస్తుండగా చెట్టు మధ్య నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్తు తీగలు తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యారు. అపస్మారక స్థితికి చేరిన ఆయన రెండుకొమ్మల మధ్య ఇరుక్కున్నారు. వెంటనే గమనించిన గ్రామస్థులు సకాలంలో స్పందించారు. ప్రాణాలకు తెగించి అతడిని కాపాడారు.
తోటి వారి సాహసం... నిలిపింది ప్రాణం...
క్షతగాత్రుడి నడుముకు తాడు కట్టి క్రేన్ సాయంతో నెమ్మదిగా కిందకు దించారు. అనంతరం అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నారు.
ఇవి చదవండి: గాంధీ వద్ద మౌనిక కుటుంబసభ్యుల ఆందోళన