కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. సీటెట్ పరీక్షను ఈ ఏడాది 135 నగరాల్లో నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. పరీక్ష రాసే పట్టణాన్ని మార్చుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈనెల 7 నుంచి 16 వరకు ఆన్ లైన్లో మార్పులు చేసుకోవచ్చునని సీబీఎస్ఈ తెలిపింది.
సీటెట్ పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం - సీటెట్ పరీక్ష తేదీల వార్తలు
జులై 5న జరగాల్సిన సీటెట్ను కరోనా పరిస్థితుల వల్ల వాయిదా వేసిన సీబీఎస్ఈ.. జనవరి 31న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున పరీక్షల కేంద్రాలను పెంచింది. 135 నగరాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
సీటెట్ పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం
జులై 5న జరగాల్సిన సీటెట్ను కరోనా పరిస్థితుల వల్ల వాయిదా వేసిన సీబీఎస్ఈ.. జనవరి 31న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున పరీక్షల కేంద్రాలను పెంచారు. మిగతా వివరాల కోసం www.ctet.nic.in ను పరిశీలించాలని సీబీఎస్ఈ వెల్లడించింది.
ఇదీ చదవండిఃపీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా.. ముందుగా డిగ్రీ పరీక్షలు