రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న పల్లె ప్రగతి రెండో విడత కార్యాక్రమంలో 18ఏళ్ల పైబడిన నిరక్షరాస్యుల జాబితా నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పల్లె ప్రగతి రెండో విడత పై జిల్లా కల్లెక్టర్లతో సీఎస్ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వందశాతం అక్షరాస్యతే లక్ష్యంగా రాష్ట్రంలో వయోజనుల అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
రెండో విడత పల్లెప్రగతిలో వందశాతం అక్షరాస్యతే లక్ష్యం - సీఎస్ సోమేశ్‌కుమార్ తాజా వార్త
రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల జాబితాను ప్రతీ గ్రామంలో నమోదుచేసి వారిని అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అక్షరాస్యత పెంపు కోసం అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మరొకరికి బోధించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామపంచాయతీలో చదవడం, రాయడం రాని వారి వివరాలను రెండో దఫా పల్లెప్రగతి సందర్భంగా సేకరించాలని జిల్లా కల్లెక్టర్లను ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన నిరక్షరాస్యుల వివరాల జాబితాను ఏరోజుకు ఆరోజు అప్డేట్ చేయాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదేశించారు. నిరక్ష్యరాస్యుల వివరాలు సేకరించేందుకు సంబంధిత ప్రొఫార్మను ఇప్పటికే జిల్లాలకు పంపినట్లు సీఎస్ తెలిపారు. జిల్లా కల్లెక్టర్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్