సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ధరణి ద్వారా సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరుగుతోందని తెలిపారు. కొన్ని నిమిషాల్లోనే ఆన్లైన్లో పేర్లు మారుతాయని పేర్కొన్నారు.
ఎలాంటి అవకతవకలు లేకుండా రిజిస్ట్రేషన్లు: సీఎస్
ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ధరణి పోర్టల్ ద్వారా సేవలు అందిస్తున్నామని... వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 18 వేల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని అన్నారు. వ్యవసాయేతర ఆస్తుర రిజిస్ట్రేషన్లు త్వరలోనే పూర్తచేస్తామంటున్న సోమేశ్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి.
ఎలాంటి అవకతవకలు లేకుండా రిజిస్ట్రేషన్లు: సీఎస్
రిజిస్ట్రేషన్ల కోసం 570 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నెలకొల్పామని.. ఎలాంటి అవకతవకలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. పెండింగ్ మ్యూటేషన్ దరఖాస్తులు కూడా మొదలయ్యాయని.. త్వరలోనే నాలా ఆటోమేషన్ ప్రాసెస్, వ్యవసాయేతర ఆస్తుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి :ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి చందంగా