12 జిల్లాల్లో నూతన కలెక్టరేట్‌లను వారం రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాలో పరిపాలన భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్‌ల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లు, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన అంశాలపై కలెక్టర్లు, సీనియర్ అధికారులతో బీఆర్కే భవన్ నుంచి సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
CS SOMESH KUMAR: కలెక్టరేట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి - telangana varthalu
నూతన కలెక్టరేట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ సోమేష్‌కుమార్ ఆదేశించారు. 12 జిల్లాల్లో నూతన కలెక్టరేట్‌లను వారం రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం టీఎస్ఐఐసీకి భూములు బదలాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇటీవల 7 జిల్లాలకు మంజూరు చేసిన నూతన వైద్య కళాశాలల నిర్మాణాలకు భూమి కేటాయించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ధరణిలో పెండింగ్ మ్యుటేషన్లు ఇతర సమస్యలను సమీక్షించి ఈనెల 9లోగా పరిష్కరించాలని.. లబ్దిదారులకు రైతుబంధు సాయం అందేలా చూడాలని సోమేశ్‌కుమార్ ఆదేశించారు. స్పెషల్ ట్రిబ్యునల్‌లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్‌లను నిర్వహించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: CM KCR: ఈ నెల 7న 19 డయాగ్నొస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం