తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ పర్యటనలో పీఎం మోదీ.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్న సీఎస్ - తెలంగాణలో మోదీ పర్యటన

CS Somesh Review PM Tour: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా ముచ్చింతల్​లోని జీయర్ ఆశ్రమంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్​ వస్తున్న ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా.. సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసి.. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. కరోనా ప్రోటోకాల్స్​ను పూర్తి స్థాయిలో పాటించాలని సూచించారు.

cs-somesh-kumar
సీఎస్‌ సమీక్ష

By

Published : Feb 3, 2022, 1:52 PM IST

CS Somesh Review PM Tour: శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన దృష్ట్యా.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులకు నిర్దేశించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

మోదీ పర్యటన ఇలా..

''పటాన్​చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్​కు వెళ్తారు. అక్కడ రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాత్రికి తిరిగి దిల్లీ బయల్దేరి వెళ్తారు.''

PM Modi Tour in Hyderabad: వేదికల వద్ద భద్రతతో పాటు ట్రాఫిక్‌ నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిపుణులైన వైద్యబృందాలను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖకు నిర్దేశించారు. కొవిడ్‌ నిబంధనలు పకడ్బందీగా అమలుచేయాలని స్పష్టం చేశారు. సరిపడా కరోనా స్క్రీనింగ్ బృందాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రధాని వాహనశ్రేణి వెళ్లే మార్గాల్లో అవసరమైన మేరకు రహదారి మరమ్మతులు చేయాలని, తగిన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను... నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి:TS High Court: 'ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్​లైన్ బోధన'

ABOUT THE AUTHOR

...view details