హరితహారం కార్యక్రమం స్పష్టమైన ప్రభావాన్ని చూపాలని, అన్ని శాఖలు ఫలితాలు చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎస్ అధ్యక్షతన హరితహారం రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆరో విడత కార్యక్రమం కోసం అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ స్పష్టం చేశారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని... తన హయాంలో చేసిన హరితహారం పనులను ప్రతి అధికారి, సిబ్బంది గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలని సీఎస్ అన్నారు.
హరితహారంలో చేపట్టే పనులన్నింటినీ తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానన్న సోమేష్ కుమార్... గ్రామస్థాయి నుంచి పచ్చదనం పెరిగేలా చూడాలని చెప్పారు. ప్రతి గ్రామపంచాయతీలోనూ ఒక పార్క్‌ను అభివృద్ధి చేయాలని, వైకుంఠధామాల వద్ద పచ్చదనం పెంచాలని తెలిపారు.