తెలంగాణ

telangana

ETV Bharat / state

వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దు : సీఎస్​

తెలంగాణకు వచ్చే అన్ని వాహనాలను నిలిపివేశామని సీఎస్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

cs somesh kumar press meet on lock down
సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఎవ్వరూ బయటకు రావొద్దు: సీఎస్​

By

Published : Mar 23, 2020, 1:00 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్​ వెల్లడించారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు. ప్రజలు ఎవరూ ప్రయాణాలు చేయొద్దని... తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అనుమతించట్లేదని వెల్లడించారు. ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడేందుకు అనుమతి లేదని తెలిపారు. ఇప్పటికే విద్యా సంస్థలన్నీ మూసివేశామని... పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు వివరించారు.

గ్రామాల్లో పనులకు మాత్రమే అనుమతి

కేవలం గ్రామాల్లో వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకం పనులు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావడానికి వీల్లేదని... నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సేవలు అవసరమైతేనే అనుమతిస్తామని... ప్రజలందరూ లాక్‌డౌన్‌కు మద్దతు ఇవ్వాలని సీఎస్​ కోరారు.

సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఎవ్వరూ బయటకు రావొద్దు: సీఎస్​

ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details