హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ రెండో దశ, ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్లపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
హెచ్ఎంఆర్ఎల్, పురపాలక, ఆర్అండ్ బీ, ఆర్థిక శాఖ, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నత స్థాయి అధికారుల బృందం ఔటర్ రింగ్ రోడ్డు, మూసి రివర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ముఖ్యమైన ట్రాఫిక్ కారిడార్‌ను సంయుక్తంగా సందర్శించాలని సూచించారు. దీనిపై నగరంలో సమగ్ర ట్రాఫిక్, ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికను ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని మెగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన హెచ్ఎంఆర్ఎల్, హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటేడ్ బోర్డు సమావేశం నిర్వహించారు.