బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ప్రస్తుత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలపై ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా.. గత సమావేశాలకు సంబంధించి పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయాలని జోషి తెలిపారు. వివిధ శాఖల అధికారులు శాసనసభ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రశ్నలతో పాటు ప్రత్యేక ప్రస్తావనలు, హామీలపై కూడా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
'ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెంటనే సిద్ధం చేయండి' - chief secretary
శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం