తెలంగాణ

telangana

ETV Bharat / state

CS Shanti Kumari Review on TS floods : 'వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి'

Flood relief measures in Telangana : మాయదారి వరదలతో అతలాకుతలమైన తెలంగాణలో ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాస చర్యలపై సీఎస్​ శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ముఖ్యంగా వరదలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

CS Shanti Kumari Review on TS floods
CS Shanti Kumari Review on TS floods

By

Published : Jul 28, 2023, 9:34 PM IST

CS Shanti Kumari Review On Telangana Floods : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలకు చిగురుటాకుల వణికిన తెలంగాణలో ఇప్పుడుప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండ ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై ప్రభుత్వ సీఎస్​ శాంతి కుమారి అన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ఇతర ముందు జాగ్రత చర్యలపై కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

డీజీపీ అంజనీకుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జిల్లా యంత్రాగం మొత్తం చేసిన సమిష్టి కృషితో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించామని సీఎస్​ పేర్కొన్నారు. మరో 24 గంటల పాటు ఇదే రకమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరద తగ్గుముఖం పట్టినందున ఆయా ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశించారు.

ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, సరిపడా ఆహరం, మంచినీరు తదితర ఏర్పాట్లు గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సహాయక కార్యక్రమాల్లో ఇప్పటికే సహకరిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడే కొనసాగించాలని స్పష్టం చేశారు. భద్రాచలం, నిర్మల్​లో రెండు బృందాలు చొప్పున... కొత్తగూడెం, ములుగు, వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి, హైదరాబాద్​లలో ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలున్నాయని వివరించారు.

Telangana Floods : పునరావాస కార్యక్రమాలకు ఎలాంటి సాయం అవసరమైనప్పటికీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ స్పష్టం చేశారు. జిల్లా పాలనా యంత్రాంగం సహాయ సహకారాలతో పలు జిల్లాల్లో దాదాపు 19 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. పలు జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, సీనియర్ పోలీస్ అధికారులను పంపి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

తెగిన చెరువులు, కుంటలను పునరుద్దరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షపాతం కొన్ని జిల్లాల్లో కురిసినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రం చేసిన ఉమ్మడి కృషితో నష్టాన్ని తగ్గించగలిగామని విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details