తెలంగాణ

telangana

ETV Bharat / state

రాచకొండ పరిధిలో మహిళా కౌన్సిలింగ్ సెంటర్​ - మహిళా కౌన్సెలింగ్ సెంటర్​

రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళా కౌన్సిలింగ్ సెంటర్​ను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. మహిళల భద్రత, సమస్యలపై ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

రాచకొండ పరిధిలో మహిళా కౌన్సిలింగ్ సెంటర్​

By

Published : Jul 26, 2019, 2:09 PM IST

కమిషనరేట్ పరిధిలో మహిళా కౌన్సిలింగ్ సెంటర్​ను నిన్న రాచకొండ కమిషనర్ మహేష్​ భగవత్​ ప్రారంభించారు. మహిళల భద్రత, సమస్యల పరిష్కారం కోసమే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ముఖ్య ఉద్దేశం కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం, భార్య భర్తల మధ్య అపోహలు తొలగిపోయి కలిసుండేలా ఈ కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుధీర్​బాబు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

రాచకొండ పరిధిలో మహిళా కౌన్సిలింగ్ సెంటర్​

ABOUT THE AUTHOR

...view details