తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రభుత్వానికి సీపీఎం లేఖ - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ కొరతతో దేశంలో వందల మంది చనిపోతున్న ఘటనలు హృదయ విదారకంగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. చనిపోయిన వారిని దహనం చేయటానికి కూడా రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ సీఎం కేసీఆర్​కు ఆయన లేఖ రాశారు.

cpm writes letter to cm
cpm writes letter to cm

By

Published : Apr 27, 2021, 9:07 PM IST

కొవిడ్‌ రెండో దశ నేపథ్యంలో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి నివారణ, బాధితులకు సహాయక చర్యలు వంటి అంశాలతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి.. మెడికల్‌, ఆర్థిక సహాయాన్ని రాబట్టుకోవాలని వివరించారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ కొరతతో దేశంలో వందల మంది చనిపోతున్న ఘటనలు హృదయ విదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. చనిపోయిన వారిని దహనం చేయటానికి కూడా రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక సాయం ప్రకటించండి..

పట్టణం నుంచి గ్రామాల దాకా అన్ని ప్రాంతాల్లో.. ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వసతులను కల్పించాలని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైనన్ని ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకొని.. కరోనా చికిత్సకు ఉపయోగించాలని ప్రభుత్వానికి సూచించారు. రేషన్‌ కార్డుతో పని లేకుండా.. ప్రతి వ్యక్తికి 10 కేజీల చొప్పున 6 నెలలకు తగ్గకుండా ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని కోరారు. ప్రతి కుటుంబానికి రూ. 7 వేల 500 నగదును ఆర్థిక సాయంగా ప్రకటించాలన్నారు. ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి, రోజూ వారి వేతనం రూ. 500 ఇచ్చేటట్లు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా.. 50 రోజులకు తక్కువ కాకుండా గ్రామాలతో పాటు పట్టణాల్లోని నిరుపేదలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు.

జర్నలిస్టులను ఆదుకోండి..

వలస కార్మికులకు నివాసాలు ఏర్పాటు చేయాలని తమ్మినేని కోరారు. సొంత ఊళ్లకు వెళ్ళాలనుకొనే వారికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రవాణాను కల్పించాలన్నారు. అలాగే ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌గా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. వైరస్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. పంట పొలాలకే నేరుగా వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. తమ శక్తి మేరకు ఐసోలేషన్‌ కేంద్రాలు, భోజన శాలలు, కరోనా సహాయ కేంద్రాలను పార్టీ తరఫున ఏర్పాటు చేయాలని నిర్ణయించిన్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్​ పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details