వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలను అర్థం చేసుకోకుండా... ప్రధాని మోదీ అవమానపరుస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ఆరోపించారు. గతంలో ఉద్యమాలు గొప్పవని యువతను ఉత్తేజ పరిచిన మోదీ.... ఇప్పుడు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు.
మోదీ నిరంకుశ పోకడలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని విమర్శించారు. ప్రత్యర్ధుల గొంతు నొక్కడానికి కేంద్ర సంస్థలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ట్విట్టర్‌కు మోదీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనుకునే వారు సీపీఎం పోరాటంలో కలిసి రావాలని కోరారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం పూనుకుందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను, హైదరాబాద్‌లో మిథాని ఫ్యాక్టరీలను కాపాడుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.