తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్యాంప్రసాద్‌ సిన్హా కమిటీ నివేదిక అమలు చేయాలి: తమ్మినేని

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూదందాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. భూబకాసురులను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

శ్యాంప్రసాద్‌ సిన్హా కమిటీ నివేదిక అమలు చేయాలి: సీపీఎం
శ్యాంప్రసాద్‌ సిన్హా కమిటీ నివేదిక అమలు చేయాలి: సీపీఎం

By

Published : Jan 19, 2021, 5:03 AM IST

రాష్ట్ర ప్రభుత్వం సిన్హా కమిటీ సిఫార్సులను అమలు చేసి కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఎం డిమాండ్ చేసింది. భూదాన్‌, చెర్వు శిఖం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై శ్యాంప్రసాద్‌ సిన్హా కమిటీ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూదందాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలో మాఫియా ప్రవేశించడం వల్ల కిడ్నాప్‌లు, హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల హఫీజ్‌పేట భూదందా, కిడ్నాప్‌కు సంబంధించిన భూమి కూడా ప్రభుత్వానిదేనన్న వార్తలొస్తున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. ప్రభుత్వ అవసరాలకు, డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లకు, స్థలాలకు భూములు లేవంటూనే... భూబకాసురులను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్యాంప్రసాద్‌ సిన్హా కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టి, ప్రజా సంక్షేమానికి తోడ్పడాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:రెండో రోజు 335 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​

ABOUT THE AUTHOR

...view details