తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ కలెక్టరేట్​ వద్ద సీపీఐ (ఎంఎల్) నేతల ధర్నా

హైదరాబాద్​ నాంపల్లిలోని కలెక్టర్​ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఆందోళనకు దిగారు. కరోనా వ్యాధి బాధితులకు నెలకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్​ చేశారు.

cpiml protest at hyderabad collectorate or covid victims
హైదరాబాద్ కలెక్టరేట్​ వద్ద సీపీఐ (ఎంఎల్) నేతల ధర్నా

By

Published : May 29, 2020, 4:31 PM IST

కరోనా బాధిత శ్రామికులను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు హైదరాబాద్​ నాంపల్లిలోని కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్పొరేట్​ కంపెనీలకు కాసులు కురిపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ బాధిత కుటుంబాలకు మరణమే శరణ్యంగా చూపిస్తున్నారని ఆరోపించారు.

గత మూడు నెలలుగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్లతో దక్కిందేమీ లేదన్నారు. వలస జీవులకు సరైన వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేదని రాష్ట్ర సర్కారును విమర్శించారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ప్యాకేజీని అందజేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి :మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details