'సింగరేణిలోనూ లాక్‌డౌన్ ప్రకటించండి" - కరోనా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సింగరేణి కాలరీస్‌లోని అండర్‌మైన్స్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించాలని కోరారు.
సింగరేణి ల్యాండ్‌మైన్స్, ఓపెన్ కాస్ట్‌లలోని ఒక్కొక్క మైనులో సుమారు 500 నుంచి 1,500 మంది వరకు కార్మికులు పనిచేస్తారన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. అండర్ గ్రౌండులో వెంటిలేషన్ సక్రమంగా ఉండనందున.. ఒక్కొరికి కరోనా వచ్చినా మైన్స్‌లో పనిచేసే వారందరికీ విస్తరించే పెను ప్రమాదముందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని సింగరేణిలో లాక్‌డౌన్ ప్రకటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.