చమురు ధరల పెంపుపై సీపీఐ ఆందోళన బాట పట్టనుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ 25న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: చాడ
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. 16 రోజుల్లో లీటరుకు రూ.10 పెరిగితే సామాన్యుడు ఎలా బతకాలని ప్రశ్నించారు.
25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు: చాడ
కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విమర్శలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న హైదరాబాద్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.