వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మద్యం అమ్మకాలు బంద్ చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ నెల 31న హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ నగర సమితి కార్యదర్శి నరసింహా తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ ప్రజలు 11 రోజులపాటు వినాయకుడికి పూజలు చేస్తుంటే.. మరో వైపు విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేపట్టడం సరికాదన్నారు.
"ఆ పదకొండు రోజులు మద్యం అమ్మొద్దు" - ఈ 11 రోజులు
వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు నిర్వహించే పదకొండు రోజులు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సీపీఐ నగర సమితి కార్యదర్శి నరసింహా డిమాండ్ చేశారు.
'ఈ 11 రోజులు మద్యం అమ్మకాలు బంద్ చేయాలి'
విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్లో వినాయక ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయన్నారు. అంతటి ఖ్యాతి కలిగిన ఈ ఉత్సవాల్లో మద్యం అమ్మకాలు కొనసాగించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సెప్టెంబర్ 2 నుంచి 11 రోజుల పాటు నగరంలో మద్యం బంద్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : 'తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్'