ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ అన్ని విభాగాలు మద్దతిస్తున్నాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సమ్మెపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని... బాధితుల పక్షానే మీడియా ఉండాలని కోరారు. ప్రజల హక్కులను కేసీఆర్ హరిస్తున్నారని... కనీసం కార్మికుల యూనియన్ ఆఫీసుల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేసుకొనే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో నిరాహారదీక్ష చేపట్టిన నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారుణమని... ఉద్యమకారులపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
'నిరంకుశత్వంపై మా గళం వినిపిస్తాం'
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని వామపక్ష నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం విమర్శించారు.
ఆర్టీసీపై సీపీఐ