తెలంగాణ

telangana

ETV Bharat / state

CPI: కరోనా నియంత్రణలో మోదీ విఫలం: డి రాజా

కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(CPI) ప్రధాన కార్యదర్శి డి రాజా ఆరోపించారు. దివంగత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 107వ జయంతి సందర్భంగా సీఆర్ ఫౌండేషన్ నిర్వహించిన వర్చువల్ వెబినార్‌లో పాల్గొన్నారు.

CPI: కరోనా నియంత్రణలో మోదీ విఫలం: డి రాజా
CPI: కరోనా నియంత్రణలో మోదీ విఫలం: డి రాజా

By

Published : Jun 6, 2021, 7:55 PM IST

దివంగత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 107వ జయంతి సందర్భంగా సీఆర్ ఫౌండేషన్ వర్చువల్ వెబినార్‌ నిర్వహించింది. ఈ వెబినార్​లో సీపీఐ(CPI) ప్రధాన కార్యదర్శి డి రాజాతోపాటు సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ పొలిట్ బ్యూరో సభ్యులు నారాయణ పాల్గొన్నారు.

కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజా ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రజా సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యాక్సిన్ పాలసీ సరిగాలేదన్నారు. యువజన సమాఖ్య నాయకునిగా ఉన్నప్పుడు కామ్రేడ్‌ సీఆర్‌తో కలిసి పని చేసిన అనుభవాలను రాజా గుర్తు చేసుకున్నారు.

చండ్ర రాజేశ్వరరావు కమ్యూనిస్టు అగ్రనేతనే కాకుండా గొప్ప దేశ భక్తుడని సురవరం సుధాకర్‌ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు, రైతాంగ సాయుధ పోరాటం, విరమణలో సీఆర్ ముఖ్య పాత్ర పోషించారంటూ స్మరించుకున్నారు.

ఇదీ చదవండి:Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details