సైబరాబాద్ సీపీ సజ్జనార్ లాక్‌డౌన్ అమలవుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. అనంతరం చేవెళ్ల ఠాణాను సందర్శించారు. అధికారులు, సిబ్బంది పనితీరు, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షించారు. ఎప్పటికప్పుడు వారి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తగు విధంగా పరిష్కరిస్తానని సజ్జనార్ హామీ ఇచ్చారు.
లాక్‌డౌన్ ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ పర్యటన - లాక్‌డౌన్ ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ పర్యటన
లాక్‌డౌన్ కొనసాగుతున్న ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పర్యటించారు. చేవెళ్ల, మెయినాబాద్ ప్రాంతాల్లోని లాక్‌డౌన్ ప్రాంతాల్లో ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
లాక్‌డౌన్ ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ పర్యటన
విధి నిర్వాహణలో ఉండే ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకునే విధంగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
ఇవీ చూడండి:లాక్‌డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్