అంబర్పేట ప్రశాంతంగా ఉంది: సీపీ - అంబర్పేట ప్రశాంతంగా ఉంది: సీపీ
అంబర్పేటలో ఆదివారం రాత్రి జరిగిన గొడవలో రెండు కేసులు నమోదు చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.
cp-press-meet
రెండు వర్గాల మధ్య జరిగన గొడవ వల్ల భయానకంగా మారిన అంబర్పేటలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. గొడవల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరినప్పడు కొందరు పోలీసులతో పాటు, స్థానికులకు గాయాలయ్యాయన్నారు. స్థానిక పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు.