తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో హరితహారం ఘనంగా నిర్వహించారు. గోషామహల్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, సెంట్రల్ జోన్ డిసిపి విశ్వప్రసాద్, వెస్ట్ జోన్ డిసిపి ఏఆర్ శ్రీనివాస్‌లు మైదానంలో మొక్కలు నాటారు. రాష్ట్రంలో అటవీ సంపద పెరగడం వల్ల పులుల సంఖ్య పెరిగిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గత ఐదేళ్లలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు.
ఊపందుకున్న హరితహారం..!
రాష్ట్రంలో హరితహారం జోరుగా కొనసాగుతోంది. పలు శాఖల అధికారులు మొక్కలు నాటి తమ వంతుగా చేయూతనిస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోషామహల్ ట్రైనింగ్ సెంటర్లో హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పోలీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌తో కలసి అన్ని పోలీసు శాఖలలో పర్యటించి తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పూలను, చెట్లను పూజించే గొప్ప సంస్కృతి ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వనాల పెంపునకు కృషి చేస్తున్నారని ఛైర్మన్ దామోదర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని పండుగలను ఎంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా నగర పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. పోలీస్‌శాఖ కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో హరితహారంలో పాల్గొనాలని కోరారు.
ఇదీ చూడండి : అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తోండగా పేలుడు