తెలంగాణ

telangana

ETV Bharat / state

మ్యాచ్​ కోసం భారీ ఏర్పాట్లు

మార్చి 2న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి ఎలాంటి వస్తువులు తీసుకురావాలి,  ఎలాంటివి నిషేధమనే వివరాలను సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

By

Published : Feb 27, 2019, 1:14 PM IST

మ్యాచ్​ కోసం భారీ ఏర్పాట్లు

మ్యాచ్​ కోసం భారీ ఏర్పాట్లు
శనివారం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే భారత్‌- ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాలతో పాటు అన్ని వైపుల గేట్ల వద్ద మొత్తం 2300 మందితో నిఘా పెడుతున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. దాదాపు 200కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ వస్తువులు నిషేధం

ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బ్యాటరీలు, బ్యాగులు, సిగరెట్లు, లైటర్లు, హెల్మెట్లు, పెన్నులు, సుగంధ ద్రవ్యాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచినీళ్ల సీసాలను స్టేడియంలోకి అనుమతించబోమని సీపీ స్పష్టం చేశారు.

ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను రాత్రి వేళ్లలో నడిచే విధంగా సమయం పొడిగించాలని కోరినట్లు మహేశ్ భగవత్ తెలిపారు. డే అండ్ నైట్ మ్యాచ్‌ను వీక్షించే ప్రేక్షకులు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details