తెలంగాణ

telangana

ETV Bharat / state

CP Chauhan on Hayathnagar Case : 'ఆ ఇద్దరూ చనిపోవాలని ముందే నిర్ణయించుకున్నారు' - రాజేశ్ మృతి కేసు వివరాలను వెల్లడించిన సీపీ చౌహాన్

CP Chauhan on Hayathnagar Rajesh Suicide Case : హయత్‌నగర్‌లో వెలుగులోకి వచ్చిన రాజేశ్‌ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని.. సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. రాజేశ్‌, సుజాత ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన వివరించారు.

RAJESH SUJATHA
RAJESH SUJATHA

By

Published : Jun 1, 2023, 5:43 PM IST

Rajesh Suicide Case Updates :రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన రాజేశ్‌, ఉపాధ్యాయురాలు సుజాత మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఇరువురూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. రాజేశ్‌ పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి గాయాలు లేవని తేలిందని వివరించారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంపై ఆధారాలు సేకరిస్తున్నామని సీపీ తెలిపారు.

Hayathnagar Rajesh Murder Case : సుజాత కుమారుడికి రాజేశ్‌ విషయం తెలిసినట్లు విచారణలో తేలిందని డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. అతను ఓసారి రాజేశ్‌పై దాడి చేశాడని వివరించారు. రాజేశ్‌ ప్రతి రోజు ఉపాధ్యాయురాలు ఇంటి చుట్టూ తిరిగేవాడని దర్యాప్తులో తేలిందన్నారు . టీచర్‌ మొదటిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని పేర్కొన్నారు. తన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. ఆమె కుమారుడు రాజేశ్‌కి చెప్పాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాము కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమని భావించిన వారిద్దరూ.. కలిసే చనిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలియజేశారు.

"రాజేశ్‌, సుజాత ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రాజేశ్‌కు ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రాజేశ్‌, సుజాతకు పరిచయంపై ఆధారాలు సేకరిస్తున్నాం. సుజాత కుమారుడికి రాజేశ్‌ విషయం తెలిసిందని తేలింది. రాజేశ్‌పై సుజాత కుమారుడు దాడి చేశాడు. రాజేశ్‌ రోజూ సుజాత ఇంటి చుట్టూ తిరిగేవాడని తేలింది. మొదట సుజాత పురుగులమందు తాగింది. తన తల్లి ఆస్పత్రిలో ఉందని కుమారుడు రాజేశ్‌కు తెలిపాడు. ఇద్దరు చనిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నారు."- డీఎస్ చౌహాన్, రాచకొండ సీపీ

అసలేం జరిగిదంటే :మే 29న అనుమానస్పద స్థితిలో హయత్‌నగర్‌ పరిసరాల్లో కుళ్లిన స్థితిలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చనిపోయిన వ్యక్తి రాజేశ్‌గా గుర్తించారు. ఆ తరువాత అతను ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ ద్వారా సుజాతతో పరిచయం ఉన్నట్లు నిర్ధారణ వచ్చారు. సుజాత భర్త.. రాజేశ్‌ను ఏమైనా చేసి ఉంటారా అని అనుమానం వ్యక్తం చేశారు. లేదా ఇతరులు ఎవరైనా హత్య చేశారా..? రాజేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును చేధించారు.

రాజేశ్‌కు ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details