తెలంగాణ

telangana

ETV Bharat / state

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - arrest

దొంగనోట్లను ముద్రిస్తూ పశువుల సంతల్లో అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

దొంగనోట్ల ముఠా అరెస్టు

By

Published : Feb 5, 2019, 7:02 PM IST

దొంగనోట్ల ముఠా అరెస్టు
రాచకొండ కమిషనరేట్​ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగనోట్ల ముఠాను ప్రత్యేక పోలీసు విభాగం అరెస్టు చేసింది. 500, 2000 రూపాయల దొంగనోట్లను ముద్రిస్తూ పశువుల సంతల్లో అసలైన నోట్లతో కలిపి మోసాలు చేస్తున్నారని రాచకొండ సీపీ తెలిపారు. 12 మంది ముఠా సభ్యుల నుంచి రూ.31లక్షల 21,500 విలువ గల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు దొంగనోట్ల ముద్రణ పరికరాలను సీజ్​ చేశారు.
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి మంచిర్యాల జిల్లాకు చెందిన ఎప్పనపల్లి రాజేశ్​ అని సీపీ తెలిపారు. దొంగనోట్లు ముద్రించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్​ భగవత్​ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details