ఓల్డ్ మలక్‌పేటలో జీహెచ్ఎంసీ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తును పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవన్నారు. రేపటి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో 15 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసి.. పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందికి రాజకీయ పార్టీలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
కౌెంటింగ్కు అంతా సిద్దం : ఓల్డ్ మలక్‌పేటలో సీపీ అంజనీకుమార్ - సీపీ అంజనీకుమార్ పర్యటన
ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్ ప్రశాతంగా జరుగుతోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి.. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. రేపటి కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో సీపీ అంజనీకుమార్ పర్యటన