నేటి నుంచి లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత కేవలం మెడికల్, ముఖ్యమైన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం: అంజనీకుమార్ - hyderabad cp anjani kumar latest news
ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నేటి నుంచి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నామని స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీపీ అంజనీ కుమార్
లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులతో పాటు వాహనాలను జప్తు చేస్తామని తెలిపారు. కొంతమంది బాధ్యతారాహిత్యం వల్ల అందరినీ ప్రమాదంలోకి నెట్టలేమంటూ సీపీ ట్వీట్ చేశారు.