హైదరాబాద్(hyderabad)లో ప్రజల సహకారంతో లాక్‌డౌన్(lock down) పటిష్ఠంగా అమలవుతోందని పోలీసు కమిషనర్(cp) అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసులకు 99శాతం మంది సహకరిస్తున్నారని... కేవలం 1శాతం మంది మాత్రమే అనసవరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పాతబస్తీలో పర్యటించిన సీపీ... మదీనా చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్ అమలుతీరును పరిశీలించారు.
Lock down: ప్రజల సహకారంతో పటిష్ఠంగా లాక్‌డౌన్ - తెలంగాణ వార్తలు
అందరి సహకారంతో హైదరాబాద్‌లో లాక్‌డౌన్(lockdown) పటిష్ఠంగా అమలవుతోందని సీపీ(cp) అంజనీ కుమార్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. పాతబస్తీలో లాక్‌డౌన్ అమలు తీరును సీపీ పరిశీలించారు.
సీపీ అంజనీ కుమార్, హైదరాబాద్‌లో లాక్‌డౌన్
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. రోజూ 6వేల వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో 180చెక్‌పోస్టుల వద్ద 24గంటలపాటు పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి:Vaccination: రేపట్నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్