సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామ పరిధిలో ఓ ఆసక్తికరమైన చోటుచేసుకుంది. శ్రీరామ జీవ సేవాసదన్లలో దూడకు జన్మనిచ్చిన తల్లి కొద్దిరోజుల్లోనే చనిపోయింది. ఆ దూడను చిన్ననాటి నుంచే కుటుంబ సభ్యుని మాదిరిగా అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు గోశాల ట్రస్టు సభ్యులు. దానికి ఏడాదైన సందర్భంగా గోశాల ట్రస్టు సభ్యులు అశోక్ దూడకు ఏకంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు. పూలమాల వేసి సత్కరించారు. పటాన్చెరు నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు నిర్వహించిన విశ్వశాంతి యాత్రలో కూడా ఈ గోవు పాల్గొందని సభ్యులు చెబుతున్నారు.
దూడకు జన్మదిన వేడుకలు... కేకు కోసి సంబురాలు - దూడకు జన్మదిన వేడుకలు... కేకు కోసి సంబురాలు
ఆత్మీయంగా పెంచుకున్న పెంపుడు జంతువు దూడను కని చనిపోయింది. అప్పటినుంచి ఆ దూడను కుటుంబసభ్యుల్లో ఒకరిగా పెంచుకున్నారు. దానికి ఏడాది పూర్తైన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
COW BIRTHDAY CELEBRATIONS IN SANGAREDDY DISTRICT
TAGGED:
Cow birthday