కరోనా సంక్షోభ సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో... వివిధ ప్రజా సంఘాలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థలు కలిసి 'తెలంగాణ ప్రజా అసెంబ్లీ' పేరుతో కొవిడ్ హెల్ఫ్‌లైన్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక దినోత్సవం మే డే సందర్భంగా ఈ హెల్ప్‌లైన్ ప్రారంభించారు. కరోనా కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కుంటున్న అన్ని రకాల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి తాము పూనుకున్నట్లు తెలంగాణ ప్రజా అసెంబ్లీ ప్రతినిధి రవి కన్నెగంటి తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఇతర సంస్థలతో కలసి ఈ వేదిక పనిచేస్తుందన్నారు.
'తెలంగాణ ప్రజా అసెంబ్లీ' పేరిట కొవిడ్ హెల్ప్‌లైన్ ఏర్పాటు - covid helpline
కరోనా విలయతాండవం నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాలన్న సదుద్దేశంతో పలు సామాజిక, ప్రజా సంఘాలు కలిసి హెల్ప్‌లైన్ ప్రారంభించారు. తెలంగాణ ప్రజా అసెంబ్లీ పేరుతో మొదలు పెట్టిన ఈ హెల్ప్‌లైన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించనున్నారు.
covid helpline started with name of telangana praja assembly
ఈ హెల్ప్ లైన్... రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తోందని వివరించారు. పూర్తి నిబద్ధతతో పని చేసే వాలంటీర్స్ ఈ హెల్ప్‌లైన్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. అనేక మంది సామాజిక శ్రేయోభిలాషులు ఈ హెల్ప్‌లైన్ వెనుక దృఢంగా నిలబడి మద్దతు ఇస్తున్నారన్నారు. తమకు ఎలాంటి సమస్య ఉన్నా... 9985833725 నంబర్‌కు ఫోన్ చేసి అయినా... ఎస్‌ఎంఎస్ ద్వారా అయినా సమాచారమిచ్చి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.