తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసులు తగ్గుతున్నాయా..? గణాంకాలు ఏమి చెబుతున్నాయి - తెలంగాణలో కొవిడ్​ గణాంకాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంతో పోల్చుకుంటే పాజిటివ్​ కేసులు తక్కువుగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్​లో నిత్యం సుమారు రెండు వేల కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 16 వందల వరకు కొత్త కేసులు వస్తున్నాయి. అయితే వాస్తవంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయా?... వాస్తవ గణాంకాలు ఆ విషయాన్ని ధ్రువ పరుస్తున్నాయా.... అంటే సమాధానం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.

కేసులు తగ్గుతున్నాయా..? గణాంకాలు ఏమి చెబుతున్నాయి
కేసులు తగ్గుతున్నాయా..? గణాంకాలు ఏమి చెబుతున్నాయి

By

Published : Oct 15, 2020, 6:25 PM IST

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి అత్యంత గణనీయంగా పెరిగిన కేసులు ఇప్పుడు కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నాయి. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ తొలి పదిహేను రోజులతో పోలిస్తే... అక్టోబరులోనూ కేసుల పరంపర యథాతథంగా కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నెల1 నాటికి రాష్ట్రంలో 1,95,609 కొవిడ్​ కేసులు నమోదుకాగా... ప్రస్తుతం 2,76,670కి పెరిగింది. అంటే రోజుకి సుమారు సగటున 1,576 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది.

గత నెల మొదటి పదిహేను రోజుల్లో 27,164 మందికి వైరస్​ సోకింది. అంటే సగటున రోజుకి సుమారు 1,811మందికి కొవిడ్​ సోకింది. గత నెలలో సగటున రోజుకి 52,375 టెస్టులు చేయగా.. ప్రస్తుతం 46,614 పరీక్షలు చేస్తున్నారు. అంటే సెప్టెంబరులో పరీక్ష చేయించుకున్న ప్రతి 28 మందిలో ఒకరికి వైరస్ నిర్ధారణ కాగా... ప్రస్తుతం 29.5 మందిలో ఒకరికి కొవిడ్​ సోకింది.

ఆగస్టుతో పోలిస్తే మాత్రం రాష్ట్రంలో కరోనా కేసులు ఉద్ధృతి గణనీయంగా తగ్గింది. ఆగస్టులో రోజుకి సరాసరి.... 1,684 మందికి వైరస్ సోకింది. కాకపోతే అప్పట్లో రోజువారి చేసిన పరీక్షల సంఖ్య తక్కువ. ఆగస్టుతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువని గణాంకాల్లో స్పష్టమవుతోంది... అదేవిధంగా సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో కేసులు తగ్గుముఖం పట్టాయన్న దానిలో వాస్తవం లేదని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. సెప్టెంబర్ కంటే అక్టోబరులో మరణాలు మాత్రం కొంత తక్కువగా నమోదవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

సెప్టెంబర్​తో పోలిస్తే గత పదిహేను రోజుల్లో రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నట్టు హెల్త్ బులిటెన్ ద్వారా స్పష్టమవుతోంది. కేసులు తగ్గుదలకి టెస్టుల సంఖ్యే కారణమన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ తగ్గుముఖం పట్టిందన్న ధీమా సరికాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన రైతులు

ABOUT THE AUTHOR

...view details